AMBATI RAMBABU
Ex- Member of Legislative Assembly, Repalle
Ex- APIIC Chairman, Andhra Pradesh

Ambati Rambabu

 

About Us

 

అంబటి రాంబాబు గారి 1958 లో బండలై చెరువు గ్రామం అవనిగడ్డ మండలం మచిలీపట్టణం కృష్ణ జిల్లా లో ఒక మద్యతరగతి కుటుంబం లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ, ఏ.వి.ఎస్.అర్. ఆంజనేయులు (అడ్వకేట్) గారి పెద్ద కుమారుడు. ఏ వి ఎస్ అర్ ఆంజనేయులు గారు ఆంధ్ర ప్రదేశ్ డైలీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా , మరియు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా పనిచేసారు, మరియు పి సి సి మెంబెర్ గా పనిచేసారు . తన బాల్యం 10 వ తరగతి వరకు బండలై చెరువు లో చదువును పూర్తిచేసి ఆతరువాత ఇంటర్మీడియట్, డిగ్రీ రేపల్లె లో పూర్తిచేశారు ఆతరువాత వైజాగ్ లో యల్.యల్.బి గా పట్టభద్రుడైన తరువాత తన తండ్రి గారి వర్ధ రెండు సంవత్సరాలు లాయర్ గా ప్రాక్టీస్ చేసారు. లాయర్ గా ప్రాక్టీస్ చేస్తుండగానే. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన అంబటి రాంబాబు కాలేజీ లో చదువుతుండగా కాలేజీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1989 లో కాంగ్రెస్ పార్టీ తరుపున రేపల్లె నుండి శాసనసభ్యుడిగా సీట్ దక్కిన్చుకొని పోటీచేసి గెలిచి మొట్టమొదటిగా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టారు.

చదువుకునే రోజుల్లో:

అంబటి రాంబాబు గారు చదువుకునే రోజుల్లో స్కూల్ మరియు కాలేజీ తరుపు నుండి డిబేటింగ్ కాంపిటీషన్ లో పాలుగొని ఎన్నో విజయాలను సాధించారు. అతను చదువుకునే రోజుల్లో రాజకీయాలపట్ల ఆసక్తిగా ఉండేవారు. ఆయన స్టూడెంట్ గా వున్నపుడు కాలేజీలలో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు, కాలేజీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన మాటల్లో అంతులేని ఆత్మవిశ్వాశం, ధర్యం కలిగిన వ్యక్తి గా ఉండేవారు. ఆయన అంతులేని మేధస్సుతో సమస్యను క్షుణంగా పరిశీలించి పట్టుదలతో పూర్తిచేసేవారు.